అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి

Published Sat, Dec 23 2023 8:18 AM

Bus And Tractor Collision: Road Accident In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వోల్వో బస్సు  ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది.

మృతులను గుత్తి మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్‌ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సూర్యోదయాన్ని చూసి వస్తుండగా..

 
Advertisement
 
Advertisement