ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు

 Bundi Girl Raped Even After Her Death By Three Men - Sakshi

Accused continued to rape Bundi girl even after her death: సమాజంలో మహిళలకు భద్రత కరువైందని అనాలో లేక వాళ్ల మనుగడే ప్రశ్నర్థకంగా ఉందని చెప్పాలో తెలియడం లేదు. స్త్రీలపై జరుగుతున్న భయంకరమైన అత్యాచారాలను గురించి వింటుంటే శరీరం గగుర్పాటుకు గురవ్వకుండా ఉండదు. మరీ ఇంత అమానుషంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్న వాళ్లను చూస్తే అసహ్యం కలగక మానదు. ఇదేకోవలో రాజస్థాన్‌కి చెందిన 16 ఏళ్ల బాలికను ముగ్గురు కిరాతుకులు అత్యంత ధారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది.

(చదవండి: ఎంత పె...ద్ద.. ‘పేరు’!)

పోలీసుల కథనం ప్రకారం...రాజస్థాన్‌లోని బుండీకి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలిక మేకలు మేపేందుకు వెళ్లి డిసెంబర్‌ 23న అదృశ్యమైంది . ఆ తర్వాత ఆమె బుండీకి సమీపంలోని అడవుల్లో శవమై పడి ఉంది. ఈ మేరకు పోస్ట్‌ మార్టంలో చాలా భయంకరమైన విషయాలు బయట పడ్డాయి . ఆ బాలిక పై ముగ్గురు వ్యక్తులు సాముహికంగా అత్యాచారం చేసి చంపేశారని నివేదిక పేర్కొంది.

అంతేకాదు ఆ బాలిక ప్రతిఘటించటంతో గొంతు నులిమి చంపారని తెలిపింది. అయితే బాలిక చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం కొనసాగించారని, పైగా ఆమె ప్రైవేట్‌ భాగాల్లో 30కి పైగా గాయలయ్యాయని పోస్ట్‌ మార్టం నివేదిక వెల్లడించింది. ఈ మేరకు బుండీ పోలీసులు మాట్లాడుతూ..."నా జీవితంలో ఇంత దారుణమైన సంఘటన చూడలేదు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము నిందితుల తరుఫున వాదించమని ప్రకటించారు" అని అన్నారు.

(చదవండి:  మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top