తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించొచ్చు! | This Womans Birth Certificate Is 2 Feet long | Sakshi
Sakshi News home page

worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!

Jan 3 2022 2:11 PM | Updated on Jan 3 2022 2:25 PM

This Womans Birth Certificate Is 2 Feet long - Sakshi

This woman has the world's longest name: మనదేశంలో చాలా మందికి ఇంటి పేరుతో కలిపి చాలా చాలా పెద్ద పేర్లు ఉండటం సహజం. మన పెద్దవాళ్లందరికి పేర్లు చాలా వరకు పొడుగ్గానే ఉండేవి. కానీ ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారులకు మూడు లేదా నాలుగు అక్షరాలకు మించి పేర్లు పెట్టడం లేదు. అయితే యూఎస్‌కి చిందిన ఒక ఆమె పేరు చాలా పెద్దది పైగా అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించాలన్న కూడా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది.

(చదవండి: మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!)

అసలు విషయంలోకెళ్లితే....అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టుకోవాలనుకుంది. పైగా ఆ పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అనుకుంది. అనుకున్నదే తడువుగా సెప్టెంబర్‌ 12, 1984లో పుట్టిన కూతురికి రోషాండియాటెల్లీనేషిఔన్నేవ్షెంక్కోయాని స్క్వాట్సియుత్ విలియమ్స్ అని పేరు పెట్టేసింది. అయితే మూడు వారాల తర్వాత సాండ్రా  భర్త ఒక సవరణను దాఖలు చేశారు.

దీంతో ఆ పేరు 1,019 అక్షరాలతో ప్రపంచంలోనే అ‍త్యంత పొడవైన పేరుగా మారింది. అంతేకాదు ఆ అక్షరాల్లో కేవలం 36-అక్షరాల మధ్య తమ కూతుర్ని కుటుంబ సభ్యులు మద్దుగా పిలుచుకునే జామీ అనే పేరు ఉందని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. అందువల్ల ఆ చిన్నారి విభిన్నమైన రెండు అడుగుల జనన ధృవీకరణ పత్రాన్ని పొందింది. దీంతో పేరుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది.

అంతేకాదు ఆ చిన్నారి తల్లిని సెలబ్రేటి హోస్ట్‌ ఓప్రా ఇంటర్యూ చేసింది. ఈ మేరకు సాండ్రా తన కూతురి పేరు విభిన్నంగా ప్రత్యేకంగా ఉండాలనుకోవడంతోనే గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌లో చోటు దక్కిందని ఓప్రాతో చెప్పింది. పైగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సమయానికి ఆ చిన్నారి వయసు 12 ఏళ్లు. ఈ క్రమంతో టెక్సాస్‌ రాష్ట్రం తన చట్టాన్ని మార్చడమే కాక  పిల్లల జనన ధృవీకరణ సర్టిఫికేట్‌లో సరిపోయే పేరు మాత్రమే ఇవ్వాలని సూచించింది.

(చదవండి: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement