
నిండునూరేళ్లు బతకమని ఆశీర్వదిస్తుంటారు.. కానీ నిండునూరేళ్ల వయసులోనూ అలుపెరుగక సేవలందిస్తున్నారు యూఎస్‌కు చెందిన ఓ డాక్టర్. ఓహియోకు చెందిన న్యూరాలజిస్ట్ హోవర్డ్ టక్కర్ 2021 ఫిబ్రవరిలో.. అంటే ఆయనకు 98 ఏళ్ల 231 రోజుల వయసులోనే ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు నూరేళ్ల వయసులోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేస్తున్నారు.
తన 100వ బర్త్‌డే తరువాత జూలైలో కోవిడ్ బారిన పడ్డారు. అప్పుడు కూడా జూమ్‌లో వైద్య సలహాలిచ్చారు. 1922 జూలై 10న జన్మించిన టక్కర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ నేవీలో సేవలందించారు. 1950 కొరియా యుద్ధ సమయంలోనూ అట్లాంటిక్ ఫ్లీట్‌లో న్యూరాలజీ చీఫ్‌గా పనిచేశారు. విశ్రాంతి తీసుకోవడం దీర్ఘాయువుకు శత్రువు లాంటిదనే ఆయన... చేసే పనిని ప్రేమించినప్పుడు పదవీ విరమణ ఆలోచనే రాదంటున్నారు. ప్రాక్టీసింగ్ సైకోఎనలిస్ట్ అయిన టక్కర్ భార్య 89 ఏళ్ల స్యూ సైతం ఇంకా పనిచేస్తోంది.
(చదవండి: ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్)