కూతురు పెళ్లి చూసి..పెళ్లి పందిట్లోనే కుప్పకూలిన తండ్రి

Bride Father Died At Marriage Hall Due To Heart Attack Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి: కూతురి పెళ్లిని కళ్లారా చూసిన కాసేపటికే.. ఒక తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ సంఘటనపై స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఎలిగేటి శంకర్‌ (55)  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన కూతురు వివాహాన్ని బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిపించారు.

పెళ్లితంతు ముగిసిన కొద్దిసేపటికే ఒక్క­సారిగా కుప్పకూలారు. బంధువులు అతన్ని హుటాహుటిన గోదావరి­ఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. వివిధ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేసిన శంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లిబాజాలు మోగిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
చదవండి: కూతురికి కానుకగా వచ్చిన బంగారంతో పుస్తెలు చేయించి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top