ఫేస్‌బుక్‌ లవ్‌.. ప్రియురాలి ఇంటి ఎదుట షాకింగ్‌ ఘటన..

Boyfriend Suicide Attempt In Front Of Girlfriend House In Tirupati District - Sakshi

ఓజిలి(తిరుపతి జిల్లా): ప్రియురాలి ఇంటి ఎదుటే ప్రియుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని కురుగొండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల మేరకు, కోట మండలం చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన శివతేజ(20) ఎన్‌బీకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాలలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో కురుగొండకు చెందిన యువతి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

వీరిద్దరికీ రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి తిరుగుతుండడంతో,  ఇరువురి ఇళ్లలో తెలిసింది. ఇటీవల కోట పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ పెట్టారు. అయినా వీరి మధ్య ఫోన్‌ ద్వారా సంభాషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో యువతికి శనివారం కురుగొండ గ్రామంలో పెళ్లిచూపులు నిర్వహించారు.

విషయం తెలుసుకున్న శివతేజ ఆదివారం యువతి ఇంటికి వచ్చాడు. యువతి బంధువులు, శివతేజకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అనంతరం వెంటనే వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని గ్యాస్‌ లైటర్‌ను వెలిగించాడు.
చదవండి: నాకెందుకు శాపం.. నేనేమి చేశాను పాపం!

మంటలు వ్యాపించి, అంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. స్థానికులు మంటలను అదుపుచేసి 108లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ దారం ఆదిలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సినిమాహాల్లో పనిచేస్తూ జీవనం... 
శివతేజ కాలేజీలో చదువుకుంటూ కోటలోని అరుణా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ తల్లిని పోషిస్తున్నాడు. ఎన్‌సీసీలో చేరి రెండు రోజులు క్రితం నెల్లూరులో పరీక్ష రాశాడని శివతేజ తల్లి సంధ్య తెలిపింది. ఆరు నెలల క్రితం చెల్లెలికి వివాహం చేశాడు. ఈ క్రమంలో ప్రియురాలి నుంచి ఫోన్‌ రావడంతో ఎన్‌సీసీ పరీక్షకు వెళుతున్నానంటూ కురుగొండకు వచ్చినట్లు సంధ్య తెలిపింది. మేజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు శివతేజ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.    

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top