HYD: సంక్రాంతి పండుగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ.. | Boy Electrocuted While Flying Kites In Attapur Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: సంక్రాంతి పండుగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ..

Jan 13 2024 11:24 AM | Updated on Jan 13 2024 11:26 AM

Boy Electrocuted While Flying Kites In Attapur Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ వేళ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కైట్‌ ఎగరవేస్తూ విద్యుత్‌ తీగలకు బాలుడు తాకాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.

గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితులతో కలిసి మేడపైకి వెళ్లిన తనిష్క్.. పతంగి ఎగరేస్తూ విద్యుత్‌ ఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతిచెందాడు. బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement