భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు

Speeding Car In Mangaluru Jumps Divider: రోడ్ల పై ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ జరుగుతూనే ఉండటం బాధకరం. ఆఖరికి పరిమితికి మించి స్పీడ్‌గా వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక చిన్న తప్పిదంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ వద్దని చెప్పిన యువత పెడచెవిన పెట్టి మరీ థ్రిల్లింగ్ అంటూ డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం అలాంటి ఘటనే మంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...మంగళూరులో రహదారికి ఒకవైపు వాహానాలన్ని ట్రాఫిక్‌లో నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి. అయితే రహదారికి కుడివైపు నుంచి స్పీడ్‌గా వస్తున్న ఒక బీఎండబ్ల్యూ కారు గాల్లోకి ఎగిరి డివైడర్ అవతల వైపున ఉన వాహనాలని ఢీ కొట్టింది. అదే సమయంలో రోడ్డు దాటేందుకు డివైడర్ పై నిలబడి ఉన్న మహిళ, అవతల వైపు స్కూటీ నడుపుతున్న మరో మహిళ పైకి దూసుకుపోయింది.
ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అయితే ఆ డివైడర్ పై ఉన్న మహిళ మాత్రం కొద్దిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. ఈ ప్రమాదం మంగళూరులోని బల్లాల్‌బాగ్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
#Karnataka
A 2 wheeler rider critically injured after a BMW car jumped over a divider and crashed into another car and two wheeler in #Mangaluru @IndianExpress pic.twitter.com/tuTouAg6FP— Kiran Parashar (@KiranParashar21) April 9, 2022
(చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో..)