కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

Published Sun, Jan 7 2024 5:07 AM

BJP MLA Sunil Kamble slaps on-duty police constable - Sakshi

పుణె: మహారాష్ట్రకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సునిల్‌ కాంబ్లే విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. శుక్రవారం పుణె కంటోన్మెంట్‌లోని సస్సూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఓ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్, ఎమ్మెల్యే సునిల్‌ కాంబ్లే హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మెట్లు దిగి వస్తున్న ఎమ్మెల్యే కాంబ్లేకి కానిస్టేబుల్‌ ఎదురయ్యారు. దీంతో, ఎమ్మెల్యే  ఆగ్రహంతో కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. శనివారం బాధిత కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే కాంబ్లే ఘటనపై స్పందిస్తూ.. నేను ఎవరిపైనా దాడి చేయలేదు. మెట్లుదిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తిని పక్కకు తోసేసి, ముందుకు వెళ్లానంతే’అని చెప్పారు.

Advertisement
 
Advertisement