మెడికో రచనా కేసులో ఏం జరిగింది?

Big Twist reveal In Medico Rachana Case - Sakshi

మెడికో రచనారెడ్డి మృతికి కారణమేంటీ?

పోలీసులు ఏం చెబుతున్నారు?

కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

సంగారెడ్డి, సాక్షి: మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆమె పెళ్లి నిశ్చయం కాగా.. ఆ వ్యవహారంలో ఏర్పడిన మనస్పర్థల వల్ల ఆమె డిప్రెషన్‌కు వెళ్లినట్టు.. దాని వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు భావిస్తున్నారు.

అమీన్‌ పూర్‌ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. "రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. ఆమె కారులో కొన్ని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ మార్చిలో వివాహానికి పెద్దలు నిర్ణయించారు. ఎంగేజ్‌మెంట్‌ జరిగిన యువకుడితో ఆమెకు మనస్పర్థలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం ఎఫ్‌ఎస్‌ఎల్‌(FSL)లోనే తేలుతుంది" అని చెప్పారు. 

మరోవైపు ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా చెల్లి గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉంది. చాలాసార్లు నచ్చజెప్పాం. మా పేరెంట్స్‌ కూడా కౌన్సిలింగ్‌  ఇచ్చారని" తెలిపారు.

జరిగింది ఇది.. 
ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25).. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ BHELలోని HIGలో ఉంటున్నారు.  అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR రింగ్ రోడ్డుపై కారులో రచనా అపస్మారక స్థితిలో ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.... ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి తుది శ్వాస విడిచింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆమె సూసైడ్‌కు పాల్పడిందని అక్కడ లభించిన ఆధారాలను బట్టి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top