నిందితుడి ఆత్మహత్య.. ఎస్‌ఐ సస్పెన్షన్‌ | Accused Takes Own Life SI Suspended In Karnataka | Sakshi
Sakshi News home page

నిందితుడి ఆత్మహత్య.. ఎస్‌ఐ సస్పెన్షన్‌

Feb 28 2021 2:30 PM | Updated on Feb 28 2021 2:43 PM

Accused Takes Own Life SI Suspended In Karnataka - Sakshi

బెంగళూరు : పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మేడపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వివరాలు... ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు అనే వ్యక్తి నుంచి పుట్టలింగస్వామి రూ. 13 లక్షలు తీసుకున్నాడు. దీంతో బాధితుడు హనుమంతనగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పుట్టలింగస్వామిని అరెస్ట్‌ చేసి శుక్రవారం రాత్రి ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చారు.

మేడపై పత్రాలు ఉన్నాయని చెప్పి పుట్టలింగస్వామి పైనుంచి కిందకు దూకాడు. ఈ హఠాత్‌ పరిణామానికి బిత్తరపోయిన పోలీసులు నిందితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి  హనుమంతనగర ఎస్‌ఐ మంజునాథ్‌ను సస్పెండ్‌ చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement