తాజ్‌కృష్ణాలో చోరీ.. నిందితురాలి అరెస్టు | Accused Of Burglar Arrested In Taj Krishna | Sakshi
Sakshi News home page

తాజ్‌కృష్ణాలో చోరీ.. నిందితురాలి అరెస్టు

Apr 3 2022 8:14 AM | Updated on Apr 3 2022 8:14 AM

Accused Of Burglar Arrested In Taj Krishna - Sakshi

పంజగుట్ట: నగదు ఉన్న బ్యాగును తస్కరించిన యువతిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ. 83 వేలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... గత నెల 29 నుంచి 31 వరకు బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో మహారాష్ట్ర థానేకు చెందిన కె.సందీప్‌ అనే టెక్స్‌టైల్‌ డిజైనర్‌ స్టాల్‌ నుంచి నగదు ఉన్న బ్యాగ్‌ మాయమైన సంఘటన విదితమే.

సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ మహిళ బ్యాగును చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు నిందితురాలు బెంగళూరుకు చెందిన మున్‌ మున్‌ హుస్సైనీ (48)గా గుర్తించారు. ఈమె ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను ఫాలో అయ్యి రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ దొంగతనాలకు పాల్పడుతుంది. బెంగళూరులో ఈమెపై రెండు దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. సోమాజిగూడ పార్క్‌ హోటల్‌లో బస చేసిందని తెలుసుకున్న పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేసి, రూ. 83 వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  

(చదవండి: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement