వృద్ధురాలిపై అత్యాచారం..నిందితుడి అరెస్ట్ | 37 Year Old Man Arrested In Delhi For For Assulting 90 Year Old Women | Sakshi
Sakshi News home page

90 ఏళ్ల వృద్ధ‌మ‌హిళ‌పై అఘాయిత్యం

Sep 9 2020 2:53 PM | Updated on Sep 9 2020 2:57 PM

37 Year Old Man Arrested In Delhi For For Assulting 90 Year Old Women - Sakshi

ఢిల్లీ :  దేశ రాజ‌ధాని ఢిల్లీలో 90 ఏళ్ల వృద్ధురాలిగా అత్యాచారానికి పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివ‌రాల ప్ర‌కారం ఢిల్లీ చావ్లాలోనా న‌జాఫ్‌గంజ్  ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్య‌క్తి అదే అదే ప్రాంతంలో నివ‌సిస్తున్న వృద్ధురాలిపై లైంగిక‌దాడికి తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. నిందుతుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఢిల్లీ క‌మిష‌న్ ఫ‌ర్ ఉమెన్ ( డీసీడబ్ల్యూ )  చీఫ్ స్వాతి మాలివాల్ బాధిత వృద్దురాలిని ప‌రామ‌ర్శించారు. కాగా  ఘ‌ట‌న జ‌రిగిన 24 గంట‌ల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయ‌డం విశేషం. పోలీసుల చ‌ర్య‌ను ప్ర‌శంసిస్తూ ప‌లువురు నెటిజ‌న్లు ట్వీట్ చేస్తున్నారు. (ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి)

Advertisement
 
Advertisement
Advertisement