ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి | Indrajit Chakraborty Response On Riya Bail Rejection | Sakshi
Sakshi News home page

ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి

Sep 9 2020 12:33 PM | Updated on Sep 9 2020 4:37 PM

Indrajit Chakraborty Response On Riya Bail Rejection - Sakshi

ముంబై : సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించి మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి బెయిల్‌ పిటీషన్‌ను తిరష్కరించటంపై ఆమె తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వరుస ట్వీట్లతో స్పందిస్తూ.. ‘‘ కూతురి విషయంలో ఇలాంటి తీర్పును ఏ తండ్రీ భరించలేడు. నేను చచ్చిపోవాలి... రియా చక్రవర్తి బెయిల్‌ రిజెక్ట్‌ అయ్యింది. ఇక గురువారం సెషన్‌ కోర్టులో తదుపరి విచారణ... ఇక్కడో జీర్ణించుకోలేని నిజం ఏంటంటే. సుశాంత్‌ బ్రతికున్నట్లయితే డ్రగ్స్‌ కేసులో అతడే ప్రధాన ముద్దాయి. ( రియా చక్రవర్తి అరెస్ట్‌ )

అందరూ అతడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ‘ప్రచారం’ చేసిన పని ‍కూడా ఇదే.  ఓ గొప్ప నటుడి జీవితం డ్రగ్స్‌ వినియోగంతో ముడిపడి ఉంది’’ అని పేర్కొన్నారు. బుధవారం మరో ట్వీట్‌లో ‘‘ ఏలాంటి ఆధారాలు లేకుండా దేశం మొత్తం రియాను జైలుకు పంపటానికి  పూనుకుందని’’ ఆవేదన వ్యక్తం చేశారు. ( సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement