ఆ దారుణం వెనుక ముగ్గురు మహిళలు | 2 Men Molested Women And Three Women Help And Blackmailed Victim | Sakshi
Sakshi News home page

అత్యాచారం వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌

Jan 31 2021 3:35 PM | Updated on Jan 31 2021 7:58 PM

2 Men Molested Women And Three Women Help And Blackmailed Victim - Sakshi

అత్యాచార దృశ్యాలను వీడియో తీసిన కళావతి అనే మహిళ....

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయటమే కాకుండా.. వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డారు కొందరు. పాల్వంచలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 18న పాల్వంచకు చెందిన ఓ వివాహితపై ఇ‍ద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. వీరికి ముగ్గురు మహిళలు సహాయం చేశారు. అత్యాచార దృశ్యాలను వీడియో తీసిన కళావతి అనే మహిళ బాధితురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేయసాగింది. దీంతో ఆమె పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

చదవండి : కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది

Advertisement
 
Advertisement
Advertisement