థానేలో బాలికపై అత్యాచారం..! | 15 years Old Girl molested And Assaulted With Hammer In Thane | Sakshi
Sakshi News home page

థానేలో బాలికపై అత్యాచారం..!

Sep 13 2021 3:59 AM | Updated on Sep 20 2021 11:36 AM

15 years Old Girl molested And Assaulted With Hammer In Thane - Sakshi

థానే: 15 ఏళ్ల బాలికపై సుత్తితో దాడి చేసి, అత్యాచారంచేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని, ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు ఆదివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి షిర్డీ నుంచి తన మిత్రులు ఇద్దరితో కలసి బాధిత బాలిక ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఉల్హాస్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిందితుడు శ్రీకాంత్‌ గైక్వాడ్‌ (30) వారిని అడ్డగించాడు. బాలికపై సుత్తితో దాడి చేశాడు.

  తోడుగా ఉన్న మిత్రులను కూడా బెదిరించాడు. అనంతరం బాలికను రైల్వే స్టేషన్‌ పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాలిక తప్పించుకోవాలని చూడగా మళ్లీ సుత్తితో దాడి చేశాడు. అయితే శనివారం ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే కల్యాణ్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement