28న నవోదయ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

28న నవోదయ ప్రవేశ పరీక్ష

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

పలమనేరు: నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో చేరేందుకు చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని 28 కేంద్రాల్లో ఈనెల 28న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు నవోదయ కౌన్సిలర్‌ శంకరప్ప బుధవారం తెలిపారు. ఇందులో సీటు దక్కితే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ దాకా ఉచితంగా విద్య అందుతుందన్నారు. మొత్తం 80 సీట్లకు 5,202 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.72 కోట్లు

కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీల ద్వారా 27 రోజులకు రూ.1,72,23,737 ఆదాయం వచ్చినట్టు ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఇందులో నగదుతో పాటు 45 గ్రాముల బంగారం, 429 గ్రాముల వెండి లభించాయి. నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.2,75,735, గో సంరక్షణ హుండీ ద్వారా రూ.13,306, ప్రచార రథం హుండీ ద్వారా రూ.3,000 వచ్చినట్లు తెలిపా రు. 299 అమెరికా డాలర్లు, 140 కెనడా డాలర్లు, 60 ఆస్ట్రేలియా డాలర్లు, 2 సింగపూర్‌ డాలర్లు, 26 యూరప్‌ యూరోలు, 4 యూఏఈ దిర్హామ్‌లు వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సాగర్‌ బాబు, ఏఈవోలు ప్రసాద్‌, హరి మాధవరెడ్డి, ధనంజయ, సీఎఫ్‌ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్‌ బాబు, దివాకర్‌ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి న్యాయవాదులు విధుల బహిష్కరణ

సాక్షి, చిత్తూరు: చిత్తూరులో న్యాయవాదులు గురువారం నుంచి మూడు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సి.సురేష్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సాయంత్రం కోర్టులను దేశంలోని ఢిల్లీ, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలిపారు. పెండింగ్‌ కేసుల పరిష్కారం, కోర్టులపై భారం తగ్గించడం దీని ఉద్దేశమని చెబుతోందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనల వల్ల మహిళా కక్షిదారులు రాత్రి వేళల్లో వాళ్ల గమ్యానికి చేరుకోవడం కష్టమని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన న్యాయవాదులపై ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు. దీనికంటే కోర్టుల్లో ఉన్న ఖాళీలకు భర్తీ చేయడం, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి నిరసనగా గురు, శుక్రవారాల్లో అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. శనివారం రెవెన్యూ కోర్టుల్లో న్యాయవాదులు విధులు హాజరుకావడంలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement