– 8లో
పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న డైయింగ్ ఫ్యాక్టరీలను మూసి వేయాలని అధి కారులు ఆదేశించినా ఫలితం లేదు.
పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం
చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాల్లో పనిచేస్తున్న సభ్యుడైనా, లేదా రాష్ట్ర సాయుధ దళాల్లో సభ్యుడై రాష్ట్రం వెలుపల పనిచేస్తున్న వ్యక్తుల భార్యలు, ఏదైనా చట్టం ప్రకారం నివారణ నిర్బంధానికి గురైన గ్రామ పంచాయతీ ఓటరు, ఎన్నికల విధి కోసం నియమించిన గ్రామ పంచాయతీ ఓటరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో మొదటి దశ ఎన్నికలకు పోటీలో నిలిచే అభ్యర్థులు ఈ నెల 21న ఖరారు కానున్నారు. ఆ స్థానాల్లో 24వ తేదీ లోపు పోస్టల్ బ్యాలెట్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. అలాగే రెండవ విడతకు 24న అభ్యర్థులు ఖరారు కానుండగా 27వ తేదీ లోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మూడవ విడతకు సంబంధించి 27వ తేదీ అభ్యర్థుల ఖరారు ఉంటుంది. ఈ క్రమంలో 30వ తేదీ లోపు పోస్టల్ బ్యాలెట్ అందజేయాల్సి ఉంటుంది. ఆయా దశల పోలింగ్‌కు సంబంధించి అభ్యర్థులు ఖరారైన వెంటనే 24 గంటలలోపు అర్హులైన వారు పోస్టల్ బ్యాలెట్లు అందజేయాలని అధికారులు స్పష్టం చేశారు.
బంగారు మొలతాడు వితరణ
కాణిపాకం: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి బుధవారం హైదరాబాద్‌కు చెందిన సత్య శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు సుమారు రూ.3 లక్షల విలువైన 28 గ్రాముల బంగారు మొలతాడు వితరణ చేశారు. ఆభరణాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్‌కు అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు.


