25 బస్తాల బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

25 బస్తాల బియ్యం స్వాధీనం

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

పుత్తూరు: రైలులో అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పుత్తూరు ఆర్పీఎఫ్‌ సీఐ కేపీ సెబాస్టియన్‌ తెలిపారు. బుధవారం వివిధ రైళ్లలో ఎస్‌ఐ విజయ్‌నాయక్‌ బృందం నిర్వహించిన తనిఖీల్లో 25 బస్తాల్లోని 600 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాని తమిళనాడు రాణిపేట ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారికి అందజేసినట్లు తెలిపారు.

యాప్‌తో ఎరువుల పంపిణీ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారానే ఎరువుల పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫార్మర్‌ ఐడీ లేదా ఆధార్‌తో లాగిన్‌ అయి భూమి, పంట వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. అనంతరం సమీప విక్రయ కేంద్రాన్ని ఎంచుకుని బుకింగ్‌ చేసుకోవాలని, బుకింగ్‌ పూర్తయ్యాక వచ్చే క్యూఆర్‌ కోడ్‌ రసీదును డీలర్‌కు చూపించి ఎరువులు పొందవచ్చని వివరించారు. ఏవైనా సాంకేతిక సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులు లేదా రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జిలను సంప్రదించాలని కోరారు.

లారీ ఢీకొని ఆవు మృతి

పుత్తూరు: పుత్తూరు పట్టణ పరిధిలోని నందిమంగళం గ్రామం వద్ద బుధవారం డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని నడపడంతో ఆవు మృతి చెందింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ తిరుపతి నుంచి చైన్నె వైపు వెళుతోంది. నందిమంగళం వద్ద రోడ్డు దాటుతున్న ఆవును లారీ ఢీకొంది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతించెదింది. స్థానికులు లారీని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను మద్యం మత్తులో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పాడి రైతుకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఉత్తమ సేవలకు స్కూటీ బహుమతి

పుత్తూరు: డిజిటల్‌, బ్యాంకింగ్‌ సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయడంలో ఉత్తమ సేవలందించిన నిండ్ర మండలం వెంగళత్తూరు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ కల్పనకు స్కూటీని బహుమతిగా అందజేసినట్లు పుత్తూరు ఐపీఓ సతీష్‌ తెలిపారు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మెర్చంట్‌ తలైవా లీగ్‌ క్యాంపెయిన్‌లో కల్పన విశేష ప్రతిభ కనబర్చి బహుమతి గెలుచుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన ముగ్గురిలో కల్పన ఒకరని వెల్లడించారు. తిరుపతి డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ మేజర్‌ సైదా తన్వీర్‌ చేతుల మీదుగా బహుమతి అందజేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐపీపీబీ మేనేజర్‌ శైలేష్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ మురళి, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement