ప్రాణం తీసిన సెల్ఫీ సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

● రైలు వస్తుండగా పట్టాలపై సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో యువకుడు మృతి ● చిత్తూరు శివారు బండపల్లి సమీపంలో విషాదం

చిత్తూరు కార్పొరేషన్‌ : రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చిత్తూరు శివారు బండపల్లి సమీపంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు మండలం మాపాక్షికి చెందిన పంజనాథన్‌ కుమారుడు వినీత్‌ (23) ఆదివారం బండపల్లిలోని తన బంధువుల ఇంటికి ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లాడు. ఈ సందర్భంగా ఇంటికి సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్లిన వినీత్‌.. రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో మాపాక్షిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement