చంద్రబాబు హయాంలోప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హయాంలోప్రజాస్వామ్యం ఖూనీ

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యకాండతో రణరంగంగా మార్చారు అధికారులు, పోలీసుల అండతో హింసాత్మకం ప్రాదేశిక ఎన్నికల్లో అరాచకాలు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయనడం హాస్యాస్పదం రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

గంగాధర నెల్లూరు: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఏమీ పట్టనట్టు నటించడం చంద్రబాబుకు అలవాటే అని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో సోమవారం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల రోజు నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ రోజు వరకు గంగాధర నెల్లూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కూటమి అల్లరి మూకలు రణరంగం సృష్టించారన్నారు. జీడీ నెల్లూరులో మహిళలపై అమానుషంగా దాడిచేసి, నామినేషన్‌ పత్రాలు చించివేశారన్నారు. ఆర్వో కార్యాలయంలోనే నామినేషన్‌ పత్రాలు చింపిన దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో జరిగిన దౌర్జన్య కాండ న్యాయస్థానాలకు, ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాల్లో, సామాజిక మాధ్యమాల్లో, వీడియోలు, ఫోటోల రూపంలో సాక్ష్యాధారాలతో తెలిసిందని అన్నారు. ఇలా జరుగుతున్న రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని అనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు. పోలీసులు, అధికారులను అడ్డుగా పెట్టుకుని దౌర్జన్యకాండకు పాల్పడిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు ప్రజల బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని అన్నారు.

పార్టీ అభ్యున్నతికి కృషి చేయండి

ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడవడమంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీలో అధినేత జగనన్నే సుప్రీం అని అన్నారు. పార్టీ ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలకు తావు లేకుండా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement