అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

చిత్తూరు కార్పొరేషన్‌ : విద్యుత్‌ పనుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని విద్యుత్‌ శాఖ సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. సోమవారం స్థానిక గాంధీ రోడ్డులోని చిత్తూరు ఆపరేషన్‌ డివిజన్‌ విద్యుత్‌ శాఖ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ శాఖలో మంజూరైన వర్క్‌ ఆర్డర్లకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయని అధికారులపై చర్యలు తప్పవన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని వర్క్‌ ఆర్డర్లకు సంబంధించిన పనులను ఈనెల 25వ తేదీలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఏఈలను ఆదేశించారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్లను మరింత వేగవంతం చేయాలని సూచించారు. విద్యుత్‌ కనెక్షన్లలో ఉన్న అదనపు లోడును కూడా గుర్తించి క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. చిత్తూరు డివిజన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు మంజూరైన వర్క్‌ ఆర్డర్లు, వాటి అమలు తీరు, పూర్తికాని పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఆపరేషన్‌ డివిజన్‌ ఈఈ మునిచంద్ర, డీఈలు, ఏఈలు తదితర విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement