ప్రతి పత్రం ప్రాధాన్యమే | - | Sakshi
Sakshi News home page

ప్రతి పత్రం ప్రాధాన్యమే

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

● సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు అప్రమత్తం కావాలి ● దరఖాస్తుతోపాటు ధ్రువపత్రాలు సమర్పించాల్సిందే

దరఖాస్తును ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. సందేహాలుంటే రిటర్నింగ్‌ అధికారి లేదా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలి. అధికారుల సూచనలు పాటిస్తూ నిబంధనల ప్రకారం నామినేషన్‌ సమర్పించాలి..

నిర్దేశిత నమూనాలో నింపిన నామినేషన్‌ పత్రం (ఫారం–3)

అభ్యర్థి, ప్రతిపాదకుడి ఓటరు జాబితా క్రమసంఖ్యలు, వార్డు వివరాలు

నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హత లకు సంబంధించిన స్వీయ ప్రకటన –స్వీయ ప్రకటనపై ఇద్దరు సాక్షుల ధ్రువీకరణ

ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్వహిస్తాననే ప్రకటన

నిర్ధేశించిన భద్రతా డిపాజిట్‌ చెల్లించిన రసీదు లేదా చలానా

రిజర్వు స్థానాల్లో పోటీ చేసేవారికి సంబంధిత కులం లేదా వర్గానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం లేదా నిబంధనల ప్రకా రం ఫారం–3లోని సంబంధిత ప్రకటన

గుర్తింపు కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రం ప్రతులు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వయస్సు నిర్ధారణ పత్రం సిద్ధంగా ఉంచుకోవడం మంచిది

చిత్తూరు కార్పొరేషన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులు నామినేషన్లకు ముందే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించే సమయంలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా, అవసరమైన ప్రకటనలు జత చేయకపోయినా నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల నిబంధనలు సూచిస్తున్నాయి.

ఫారం–3 తప్పనిసరి

ప్రస్తుత ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం సర్పంచ్‌ పదవులకు పోటీచేసే అభ్యర్థులు నిర్దేశిత ఫారం–3లో నామినేషన్‌ దాఖలు చేయాలి. ఈ పత్రాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి పొందవచ్చు. అభ్యర్థిపేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, వయస్సు, ఓటరు జాబితాలోని, క్రమసంఖ్య, పోటీచేసే పదవి, వార్డు వివరాలను సృష్టం నమోదు చేయాలి. అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు కూడా నామినేషన్‌ పత్రం పై సంతకం చేయాలి.

డిపాజిట్‌ ఎంతంటే

జనరల్‌ రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 డిపాజిట్‌ చెల్లించాలి. వార్డు సభ్యుల పదవికి సాధారణ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. డిపాజిట్‌ చెల్లించిన ఆధారాన్ని నామినేషన్‌తో పాటు సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీ చేసేవారు ఆయా స్థానాలకు నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి. కులం లేదా వర్గానికి సంబంధిం చిన వివరాలను నామినేషన్‌ పత్రంలో పేర్కొన్నాలి. సంబంధిత ధ్రువీకరణ పత్రం ఉంటే ముందుగానే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత గ్రామ పంచాయతీకి నియమించిన రిటర్నింగ్‌ అధికారి వద్ద అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు స్వయంగా నామినేషన్‌ పత్రాన్ని సమర్పించాలి. సమర్పించిన అనంతరం రిటర్నింగ్‌ అధికారి నుంచి రసీదు తీసుకోవాలి. అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

అనర్హతలపై అవగాహన

చట్టప్రకారం పోటీకి అనర్హత కలిగించే అంశాలను అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. ఎన్నికల చట్టంలో పేర్కొన్న అనర్హతలు, సంబంధిత స్థానానికి అవసరమైన రిజర్వేషన్‌ అర్హతలు, ఓటరు జాబితాలో పేరు లేకపోవడం, తదితర అంశాలు నామినేషన్‌ తిరస్కరణకు కారణమవుతాయి. స్థానిక సంస్థలకు సంబంధించిన బకాయిల విషయంలోను వర్తించే చట్టపరమైన నిబంధనలు తెలుసుకోవాలి. తాజా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిటర్నింగ్‌ అధికారి వద్ద నిర్ధారించుకోవాలి. సర్పంచ్‌ అభ్యర్థికి అదే గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ వార్డులోనైనా ఓటరుగా నమోదైన వ్యక్తి ప్రతిపాదకుడిగా ఉండొచ్చు. అయితే వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థికి సంబంధిత వార్డులో ఓటరుగా నమోదైన వ్యక్తే ప్రతిపాదకుడిగా ఉండాలి. ఈ విషయంలో పొరపాటు జరిగితే నామినేషన్‌ తిరస్కరణకు అవకాశం ఉంటుంది.

ఇవీ ముఖ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement