జనవరి నాటికి డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

జనవరి నాటికి డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌ కేంద్రం

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

తిరుపతి తుడా: మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో పెరుగుతున్న పాదాల సమస్యలు, దీర్ఘకాలిక గాయాలు, ఇన్ఫెక్షన్లు, అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులను నివారించేందుకు సమగ్ర వైద్య సేవలను అందించే దిశగా స్విమ్స్‌, బర్డ్స్‌ సంయుక్తంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా స్విమ్స్‌ డైరెక్టర్‌, వీసీ డాక్టర్‌ జగదీష్‌ అధ్యక్షతన డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌, వౌండ్‌ మేనేజ్‌మెంట్‌, డయాబెటిక్‌ లింబ్‌ సాల్వేజ్‌ సేవలను మరింత బలోపేతం చేయడానికి శనివారం స్విమ్స్‌లో జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డైరెక్టర్‌ మాట్లాడుతూ స్విమ్స్‌, బర్డ్‌లో సమగ్ర డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌, వౌండ్‌ మేనేజ్‌మెంట్‌, డయాబెటిక్‌ లింబ్‌ సాల్వేజ్‌ సేవలను జనవరి 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముందుగా వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, వర్క్‌షాప్‌ నిర్వహించి, అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ పర్యవేక్షణ వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement