గంగవరం : ఆనందంగా తీర్థయాత్రకు వెళ్లినవారు మృతదేహాలుగా స్వగ్రామానికి వచ్చారు. పూరీజగన్నాథుని దర్శనానికి వెళుతూ బైతరణి నదిలో కొట్టుకుపోయి కన్నుమూశారు. మనవరాలిని కాపాడే క్రమంలో దంపతులు తమ ప్రాణాలను కోల్పోయారు. శుక్రవార ఈ మేరు ఇరువురి మృతదేహాలు గంగవరం మండలం మేలు మాయి క్రాస్‌కు చేరుకున్నాయి. గ్రామస్తులను శోకసంద్రంలో ముంచేశాయి.
దైవదర్శనం చేసుకునే లోపే..
గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన శ్రీనివాసులు(65), దేవి(55) రైస్ మిల్‌తో పాటు ఇటుకల బట్టీ నడుపుతున్నా రు. వీరికి బాలు, మోహన్ అనే కుమారు లు, కుమార్తె కావ్య ఉన్నారు. అందరికీ వివాహాలై వేర్వేరు చోట్ల స్థిరపడగా చిన్న కొడుకు మోహన్ మాత్రం తండ్రి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం బెంగుళూరుకు వెళ్లారు. కుమార్తె కావ్య, అల్లుడు కిరణ్, మనవరాలు యశస్విని, కొందరు బంధువులతో కలిసి రైలులో తీర్థయాత్రకు వెళ్లారు. ముందుగా జైపూర్ వెళ్లి, అక్కడి నుంచి టూరిస్ట్ బస్సులో పూరీ క్షేత్రానికి బయలుదేరారు.గురువారం పూరీ సమీ పంలోని బైతరణి నదిలో సాన్నానికి దిగా రు. యశస్విని(6) గుంతలో పడిపోగా మన వరాలిని రక్షించడం కోసం శ్రీనివాసులు, దేవి నదిలో కొట్టుకుపోయారు. ఈ వార్త తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు తీరని విషాదంలో మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలకు జైపూర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం విమానంలో బెంగుళురుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి రెండు అంబులెన్సుల్లో స్వగ్రామం మేలుమాయి క్రాస్‌కు తరలించారు. అలా మృతదేహాలు గ్రామానికి చేరుకోగానే బంధువు లు, స్థానికులు కన్నీటిపర్యంతమ య్యారు. శనివారం వారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.


