ప్రైవేటు బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

గంగాధర నెల్లూరు : జీడీ నెల్లూరులో శుక్రవారం ప్రైవేట్‌ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. పాలసముద్రం మండలం వెంగళరాజు కుప్పం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన కామాక్షమ్మ (75) తన కుమారుడుతో కలిసి జీడి నెల్లూరులోని నీవా నది వంతెనకు సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి కామాక్షమ్మ రోడ్డు దాటుతుండగా పుత్తూరు వైపునకు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. క్షతగాత్రురాలిని స్థానికుల వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్ర వారం కామాక్షమ్మ మరణించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రూ.4 కోట్లతో

నిరంతరాయ విద్యుత్‌

తిరుపతి రూరల్‌: తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌)లో డిసెంబర్‌ 4 నుంచి నిర్వహించనున్న డీఎస్‌జీపీ/ఐజీఎస్‌పీ కాన్ఫరెన్స్‌–2026 నేపథ్యంలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లను సీఎండీ శివశంకర్‌ లోతేటి పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సుకు విద్యుత్‌ అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం తిరుపతి కార్పొరేట్‌ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సు కోసం రూ.4 కోట్ల వ్యయంతో 1,866 కిలోవాట్ల సామర్థ్యంతో ప్రత్యేక విద్యుత్‌ వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. పది ప్రాంతాల్లో 27 ట్రాన్స్‌ఫార్మర్లు, 47 జనరేటర్లు, 70 విద్యుత్‌ స్తంబాలు, 3.5 కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎండీ ఆదేశించారు. ఈ సమీక్షలో డైరెక్టర్‌ (టెక్నికల్‌) కే.గురవయ్య, సీజీఎం (ఆపరేషన్స్‌) కే.సంపత్‌ కుమార్‌, తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ వి.చంద్రశేఖరరావు, ఈఈ చిన్నరెడ్డప్ప, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు, పాల్గొన్నారు.

బ్రోచర్‌ ఆవిష్కరణ

తిరుపతి రూరల్‌: బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ రంగాల్లో సరికొత్త పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలకు వేదికగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిలవనుంది. విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ పాలమూరు విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్‌ 17, 18 తేదీల్లో ‘బయోమైక్రో ఫ్రాంటియర్స్‌–2026’ పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ‘సుస్థిర అభివృద్ధి కోసం బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలు’ అనే ఇతివృత్తంతో హైబ్రిడ్‌ విధానంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్‌ ఆచార్య ఆర్‌.ఉష ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement