వి.కోట : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో ఓ ఉపాధ్యాయుడి అసభ్య ప్రవరన కలకలం రేపింది రమేష్ అనే ఉపాధ్యాయుడు ప్రవర్తనపై బాలి కల తల్లి దండ్రులు శుక్రవారం మాట్లాడుతూ డీవైఈఓ తులసి తూతూమంత్రంగా విచారణ చేపట్టి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కీచక ఉపాధ్యాయుడు, సహకరిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సెస్పెన్షన్‌కు గురైనప్పటీకి రమేష్ ప్రవర్తనలో మార్పు రాలేదని మండిపడ్డారు. అతడి కారణంగా పాఠశాలకు వెళ్లేందుకు సైతం విద్యార్థినులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులే ఈ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ , తమ ఆవేదనను వెల్లడిస్తున్న విద్యార్థినులు


