సర్పరాజుపై సర్వాంతర్యామి | - | Sakshi
Sakshi News home page

సర్పరాజుపై సర్వాంతర్యామి

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

తిరుమల: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి, తిరుపతి జేఈవో డాక్టర్‌ శరత్‌, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌, వీజీవో సురేంద్ర, పేష్కార్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు

వి.కోట : మండలంలోని తోటకనుమలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో శుక్రవారం చేరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ వారికి కండువాల కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో బైరుపల్లి పంచాయతీకి చెందిన జీఎంఎస్‌ గణేష్‌, అహ్మద్‌ బాషా, ఫైరోజ్‌ ఉన్నారు. వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. నాయకులు శ్రీరాములురెడ్డి, ఇంద్రేష్‌, సుబ్బు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement