అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు స్టేట్‌ రివ్యూ మిషన్‌ | - | Sakshi
Sakshi News home page

అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు స్టేట్‌ రివ్యూ మిషన్‌

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌ నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను స్టేట్‌ రివ్యూ మిషన్‌ సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, రికార్డులు, రిజిస్టర్లు, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వహణ తీరు ను సమీక్షించిన అనంతరం వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, ప్రజల కు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సృజన, కన్సల్టెంట్‌ రామ్మోహన్‌, డీపీఎంఓ డాక్టర్‌ ప్రవీణ పాల్గొన్నారు.

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఆసియా

చిత్తూరు కలెక్టరేట్‌ : జాతీయ స్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఆసియా ఎంపికై నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చందు, కోశాధికారి దేవానంద్‌ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆసియాకు అభినందనలు తెలిపారు. ఇటీవల వైఎస్సార్‌ కడప జిల్లా పుల్లంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌లో జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి నాలుగో స్థానం కై వసం చేసుకుందన్నారు. ఈ పోటీల్లో వ్యక్తిగతంగా అత్యుత్త మ ప్రతిభ కనబరచిన ఆసియాను రాష్‌ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసిన ట్లు వెల్లడించారు. పంజాబ్‌లోని భటిండా నగరంలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ఆసియా పాల్గొంటుందన్నారు. ఆసియా ప్రతిభ కనబరిచి జిల్లాకు, మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement