విరిగిన కాలు కట్టుకోసం వెళితే మరో కాలు విరిగింది | - | Sakshi
Sakshi News home page

విరిగిన కాలు కట్టుకోసం వెళితే మరో కాలు విరిగింది

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

● ఆటో బోల్తాపడి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు

పలమనేరు: విరిగిన కాలుకు కట్టు కట్టించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో మరో కాలు విరిగింది. ఈ సంఘటన మండలంలోని పలమనేరు– కుప్పం రహదారిలోని బేలుపల్లి వద్ద గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్‌కు చెందిన అనిత(43)కు ఇటీవల కాలు విరిగింది. దీంతో ఆమె తన బంధువు ప్యూపాలుతో కలిసి బైరెడ్డిపల్లి మండలంలోని బేలుపల్లిలో నాటు కట్టు కట్టించుకునేందుకు ఆటోలో వచ్చారు. గురువారం బేలుపల్లిలో కట్టు కట్టించుకుని కేజీఎల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. బేలుపల్లి క్రాస్‌ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అనితకు మరో కాలు విరిగింది. స్థానికులు 108కు కాల్‌ చేద్దామన్నా ఆటో డ్రైవర్‌ ఒప్పుకోలేదు. కిందపడిన ఆటోను అతనే పైకిలేపి సీట్లను సరి చేసి అక్కడున్న వారి ద్వారా గాయపడిన ఇద్దరిని ఆటోలో వేసుకుని తిరిగి కేజీఎఫ్‌కు బయలుదేరాడు. దీంతో ఈ ప్రమాదంపై పలమనేరు పోలీసులకు సమాచారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement