రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

శ్రీరంగరాజపురం : మండలంలోని దేవళంపేట– తిరుపతి రోడ్డులో ఉన్న కటికపల్లి సచివాలయం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. పెనుమూరు మండలం గొడుగుమానుపల్లికి చెందిన జి.దేవేంద్రన్‌ తన వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌లో 49 కొత్తపల్లిమిట్టకు వెళ్లాడు. పనులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. కటికపల్లి వద్ద ఇనప కమ్మీల లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ సడన్‌గా బ్రెక్‌ వేయడంతో వెనుక ద్విచక్ర వాహనంలో వస్తున్న దేవేంద్రన్‌కు కమ్మీలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని విలేజ్‌ క్లినిక్‌ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థినికి అభినందనలు

శ్రీరంగరాజపురం : తనకు దొరికిన రూ.ఐదు లక్షల విలువైన బంగారు గొలుసును ఉపాధ్యాయులకు విద్యార్థిని ఉపాధ్యాయులకు అందజేసింది. మండలంలోని ఎన్‌.ఆర్‌.పురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బయాలజి ఉపాధ్యాయుడు మోహన్‌నాయుడు 40 గ్రాముల బంగారు గొలుసును పోగొట్టుకున్నారు. ఎంత వెతికినా దొరకలేదు. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని బుజ్జికి బంగారు గొలుసు దొరికింది. దాన్ని ఆమె హెచ్‌ఎం హేమాద్రికి అందజేసింది. ఆయన విద్యార్థుల సమక్షంలో గొలుసును ఉపాధ్యాయుడికి అందజేసి విద్యార్థిని బుజ్జిని అభినందించారు. భవిష్యత్‌లో కూడా మనవి కాని వస్తువులు ఎక్కడైనా కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌లో అందజేయాలని సూచించారు. అనంతరం విద్యార్థి బుజ్జికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు.

త్వరలో సంజీవని

టెలీమెడిసిన్‌ సేవలు

తిరుపతి తుడా: స్విమ్స్‌ ఆస్పత్రిలోని తొమ్మిది వైద్య విభాగాల్లో త్వరలో సంజీవని టెలీ మెడిసిన్‌ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ తెలిపారు. గురువారం స్విమ్స్‌ శ్రీపద్మావతి ఆడిటోరియంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ విభాగంతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం అమలులో రాష్ట్ర స్థాయిలో స్విమ్స్‌ విశేష ప్రగతి సాధించడం గర్వకారణమన్నారు. అక్టోబర్‌లో 2,519 మంది రోగులకు రూ.11.85 కోట్ల మేర వైద్యసేవలందించినట్టు వెల్లడించారు. అర్హులైన ప్రతి పేద రోగిని గుర్తించి, వారికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా నాణ్యమైన వైద్యసేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. తొలి దశలో కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ప్రసూతి, సీ్త్రరోగాలు, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌ విభాగాలను టెలీమెడిసిన్‌ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఖాతాదారులకు

నాణ్యమైన సేవలే లక్ష్యం

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తమ ఖాతాదారులకు నాణ్యమైన, సురక్షితమైన బ్యాంకింగ్‌ సేవలు అందించడమే లక్ష్యమని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ హెడ్‌ పత్రి శ్రీనివాసకుమార్‌ తెలిపారు. యూనియన్‌ బ్యాంకు 108వ వ్యావస్థాపక దినోత్సవాన్ని బుధవారం సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేటు పంక్షన్‌ హాలులో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు 10 వినియోగదారుల కేంద్రిత ఉత్పత్తులను ప్రారంభించిందని, త్వరలోనే దేశ వ్యాప్తంగా 108 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని తమ ఖాతాదారులకు మెరుగైన సేవలందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్‌ కొట్టే సాయిప్రసాద్‌, రాస్‌ పీడీ నాగరాజు, యూనియన్‌ బ్యాంకు జోనల్‌ అస్సూరెన్స్‌ హెడ్‌ ఐకె.సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement