వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓటమి జీర్ణించుకోలేక కార్యకర్త మృతి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓటమి జీర్ణించుకోలేక కార్యకర్త మృతి

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

బైరెడ్డిపల్లె: వైఎస్సార్‌ సీపీకి ఆదరణ ఉన్నా కూటమి నేతలు చేసిన అక్రమాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి ఓడిపోయాడు. దీన్ని జీర్ణించుకోలేని బైరెడ్డిపల్లె మండలం ధర్మపురి పంచాయతీ యూత్‌ వింగ్‌ సెక్రటరీ రమేష్‌ (35) బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ నెలలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ధర్మపురి పంచాయతీ సెగ్మెంట్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మొగసాల శోభ పోటీ చేశారు. రమేష్‌ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశాడు. కూటమి నేతలు పోలింగ్‌ కేంద్రం వద్ద అక్రమాలకు పాల్పడడం, కౌటింగ్‌లో జిమ్ముక్కులు చేయడంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఓడిపోయారు. దీన్ని రమేష్‌ జీర్ణించుకోలేక మనస్తాపం చెంది తీవ్రంగా కుంగిపోయాడు. బుధవారం గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. రమేష్‌ భౌతికకాయాన్ని గురువారం ఉదయం స్వగ్రామమైన తూర్పుగడ్డకు తీసుకువచ్చారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ మొగసాల రెడ్డెమ్మ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, మాజీ ఎంపీపీలు మొగసాల రెడ్డెప్ప, శ్రీనివాసులురెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆర్‌.కేశవులు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దయానందగౌడు తదితరులు రమేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement