జీవో 158 అమలుకు సత్వర చర్యలు
శ్రీరంగరాజపురం : మండలంలోని నెలవాయి సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. బంగారుపాళ్యం మండలం బోడబండ్లకు చెందిన పాండురంగయ్య మండలంలోని జీఎంఆర్ పురం గ్రామానికి చెందిన సుధాకర్‌తో కలిసి గ్రామాల్లో టమాటా వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వ్యాపారం ముగించుకుని చిత్తూరు – పుత్తూరు జాతీయ రహదారిలోని నెలవాయి సబ్ స్టేషన్ వద్ద నిలుచుకుని ఉన్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన పాండురంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.


