రాజశేఖర్‌ రాజుకు ఆత్మీయ వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

రాజశేఖర్‌ రాజుకు ఆత్మీయ వీడ్కోలు

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో 37 సంవత్సరాల 6 నెలలు సేవలు అందించిన మాజీ ఎస్పీ (నాన్‌కేడర్‌) ఎస్‌ఆర్‌.రాజశేఖర్‌ రాజు సేవలు పోలీసు శాఖకు గర్వకారణమని జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి కొనియాడారు. అక్టోబర్‌లో పదవీ విరమణ పొందిన రాజశేఖర్‌ రాజుకు బుధవారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీ తుషార్‌ డూడి మాట్లాడుతూ 1989 మే 1న సివిల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో ప్రవేశించిన రాజశేఖర్‌ రాజు అంచెలంచెలుగా ఎదిగి ఎస్పీ (నాన్‌ క్యాడర్‌) స్థాయికి చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనమన్నారు. కడప జిల్లాలోని ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తూ హింసను సమర్థవంతంగా అరికట్టడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తన సర్వీసు కాలంలో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌, గవర్నర్‌ మెడల్‌, మహోన్నత సేవా పతకంతో పాటు మొత్తం 350కి పైగా అవార్డులు, రివార్డులు సాధించారని తెలిపారు. 2002 నుంచి 2026 వరకు వరుసగా 24 ఏళ్ల పాటు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడం విశేషమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత ఎస్‌.ఆర్‌.రాజశేఖర్‌ రాజు మాట్లాడుతూ తన సుదీర్ఘ సేవా ప్రస్థానంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement