జీవో 158 అమలుకు వినతి | - | Sakshi
Sakshi News home page

జీవో 158 అమలుకు వినతి

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రభుత్వం జారీ చేసిన జీవో 158 అమలుకు సత్వరం చర్యలు చేపట్టాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎస్టీయూ, టీఎన్‌యూఎస్‌, 2003 డీఎస్సీ అసోసియేషన్‌ నాయకులు బుధవారం చిత్తూరులో డీఈవో లక్ష్మినారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ 2003 డీఎస్సీలో ఎంపికై వివిధ కారణాలతో 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన వారు సీపీఎస్‌ నుంచి పాతపెన్షన్‌ విధానానికి మారేందుకు ప్రభుత్వం జీవో 158 జారీ చేసిందన్నారు. ఈ జీవోను జిల్లాలో సత్వరం అమలు చేయాలన్నారు. ఓపీఎస్‌ అమలుకు జారీ చేసిన జీవో అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్ల డీఎస్సీ సెలక్షన్‌ లిస్ట్‌, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌, జాయినింగ్‌ రిపోర్ట్‌, సర్వీస్‌ రిజిస్టర్లను పరిశీలించి ఉత్తర్వులు జారీచేయాలన్నారు. ఉత్తర్వులు వర్తించే టీచర్లు 15 రోజుల్లోగా నిధి యాప్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉందన్నారు. ఇందుకు డీఈవో కార్యాలయంలో వెంటనే ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటామోహన్‌, చంద్రన్‌, టీఎన్‌యూఎస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌, 2003 డీఎస్సీ టీచర్లు డిల్లీ ప్రకాష్‌, పురుషోత్తం, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement