యాదమరి: వన్యప్రాణుల వేట కోసం వేసిన విద్యుత్ తీగలు తోటి స్నేహితుడి ప్రాణాన్ని బలికొనగా, ఆ తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఆధారాలు లేకుండా కాల్చేసిన ఆరుగురు నిందితులు బుధవారం పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. సీఐ శ్రీధర్‌నాయుడు కథనం మేరకు.. మండలంలోని పాచిగుంట గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు గత నెల 29న పొలం వద్ద అడవి పందులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చారు. వారితో ఉన్న వేణు అనే యువకుడు ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి అక్కక డిక్కడే మృతి చెందాడు. భయపడిన మిగిలిన ఆరుగురు ఆనవాళ్లు లేకుండా విద్యుత్ తీగలు, వాడిన సామగ్రిని అడవిలోనే కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ ఈశ్వర్ తన సిబ్బందితో బుధవారం ఓటివారిపల్లి మార్గంలో నిందితులను పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో పచ్చాపూరు గ్రామానికి చెందిన మణిగండన్, సుకేంద్ర, పాచిగుంటకు చెందిన అరుళ్‌కుమార్, కుమరేశన్, భానుప్రసాద్, రాము ఉన్నారు.


