‘ఓపెన్‌’ అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

కూటమి దౌర్జన్యాలకు వెరవని వైఎస్సార్‌సీపీ సైన్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్షం

జీడీనెల్లూరు నియోజకవర్గంలో సంచలనం

ఫలితాల కంటే పోరాటమే ఆదర్శనీయం

దొంగ ఓట్లు.. రిగ్గింగ్‌.. దాడులకు సడలని సంకల్పం

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ లక్ష్మీనారాయణ ఆదేశించారు.

‘చెల్లని’ అవగాహన!

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు రావడం పలువురు మేధావులు, నేతలను ఆందోళనకు గురి చేసింది.

బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

చిత్తూరులో మున్సిపల్‌ పోలింగ్‌ రోజు టీడీపీ గూండాల చేతిలో గాయపడిన రోషన్‌ (ఫైల్‌)

వి.కోట వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ప్రకాష్‌ తలపగులగొట్టిన టీడీపీ గూండాలు (ఫైల్‌)

సాక్షి, చిత్తూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీగా స్థానాలు గెలుచుకోలేదు. అద్భుతాలు సృష్టించలేదు. కానీ, దానికి మించి పోరాట పటిమను చూపించింది. పార్టీ ఎవరినైతే నమ్ముకుందో.. ఆ కార్యకర్తలు తమ శక్తికి మించి అధికార పార్టీ నేతలతో పోటీ పడ్డారు.

ప్రాదేశికంలో సంచలనాలే..

ఇటీవల వెలువడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు చూసి అధికార పక్షం విర్రవీగుతోంది. జెడ్పీ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసి, ప్రతిపక్షాన్ని అథఃపాతాళానికి తొక్కేశామని చెబుతోంది. కానీ, ప్రాదేశిక పోరు ఆరంభంలోనే నామినేషన్లు వేయకుండా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రోడ్డుపై కూర్చుని గూండాగిరీ చేసిన విషయం చిత్తూరు ప్రజానీకం మరచిపోదు. మాజీ డిప్యూటీ సీఎంపై దాడికి యత్నం, నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతల తలలు పగులగొట్టడం తెలిసిందే. ఇక పోలింగ్‌ రోజున గుడిపాల, నగరి, కుప్పం, పలమనేరు, పెనుమూరు మండలాల్లో జరిగిన దౌర్జన్యకాండలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రక్తమోడారు. పలు చోట్ల ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు గెలిస్తే రీకౌంటింగ్‌ పేరిట టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ఆర్‌ఓల విషయం అందరికీ తెలిసిందే. ఇంతటి గూండాగిరీ, దౌర్జన్యాల్లో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ నాయుడు సొంత మండలమైమన గుడిపాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముచ్చెమటలు పోయించారు. నగదు, మద్యం విచ్చలవిడిగా పంచిపెట్టినా సదరు ఎమ్మెల్యే కంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే ప్రజలు మద్దతు పలికారు. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను, టీడీపీ 6, జనసేన 1స్థానం గెలుచుకుంటే.. వైఎస్సార్‌సీపీ 5 స్థానాలు కై వసం చేసుకుంది. అంటే దాదాపు వైఎస్సార్‌సీపీకే ప్రజలు నైతిక విజయాన్ని ఇచ్చేశారు. ఇక జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పెద్ద సంచలనాలే నమోదయ్యాయి. మొత్తం 77 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 39 గెలుచుకుంటే.. టీడీపీకి దక్కింది 35 మాత్రమే. కార్వేటినగరం, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌ పురం జెడ్పీటీసీ స్థానాల్లో ఫ్యాన్‌ ప్రభంజనానికి ప్రతిపక్షం కొట్టుకుపోయింది. పూతలపట్టులో 10 ఎంపీటీసీ, పలమనేరులో 25, చిత్తూరులో 6, నగరిలో 5 స్థానాలు వైఎస్సార్‌సీపీ విజయం బావుటా ఎగురవేసి ప్రజల మద్దతు కూడగట్టుకుంది.

పురపోరులో కూటమికి సవాల్‌

తొలుత నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ కుట్రలు మొదలు పెట్టింది. నగరిలో అప్పటి వరకు పోటీలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిని ఆర్‌ఓ పక్కనపెట్టి టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించేశారు. అయినాసరే వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ డీలా పడకుండా అన్ని వార్డుల్లో ఆత్మస్థైర్యంతో పోటీచేశారు. ఏకగ్రీవంతో కలిపి 7 వార్డులు గెలుచుకున్నారు. చిత్తూరులో 60 డివిజన్లకు ఏకంగా 51 చోట్ల ఫోర్జరీ సంతకాలతో పాలకపక్షం ఏకగ్రీవాలు చేసుకున్నా.. 9 చోట్ల జరిగిన ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ మూడు డివిజన్లలో జెండా ఎగురవేసింది. మేయర్‌ అభ్యర్థికి 27 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పలమనేరులో 6 వార్డులు వైఎస్సార్‌సీపీకి దక్కాయి.

నయా జోష్‌..

అందరూ చూస్తుండగానే నామినేషన్లను టీడీపీ నేతలు చించివేశారు. ఎన్నికలు జరగకుండానే ఫోర్జరీ సంతకాలు, బెదిరింపులతో 71 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెనక్కుతగ్గలేదు. అవమానంగానూ భావించలేదు. ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వాలని భావించి ప్రాణాలను అడ్డుపెట్టి నిలబడ్డారు. ఇక్కడే ప్రజలు కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాట స్ఫూర్తిని విశ్వసించారు. ప్రాదేశిక పోరులో టీడీపీ చేసిన గూండాగిరీకి మరొకరైతే ఇంటి నుంచి బయట వచ్చేవాళ్లు కాదు. అయితే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సగౌరవంగా పోటీచేసి, నిజాయితీగా ఓట్లు, సీట్లు సాధించారు. ఇది వైఎస్సార్‌సీపీ క్యాడర్‌లో కొత్త జోష్‌ను తీసుకొచ్చిందనే భావించాలి. 2029లో జరిగే ఎన్నికల్లో మరింత పోరాటం చేస్తే.. జిల్లాలో క్వీన్‌స్వీప్‌ ఖాయమనే సంకేతం ఇస్తూ, గూండాగిరీకి భయపడమని స్పష్టంగా తెలియజేశారు.

జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 6,86,762 ఓట్లు పోలైతే.. ఇందులో టీడీపీకి 3,45,873 ఓట్లు పడ్డాయి. వైఎస్సార్‌సీపీకి 2,85,704 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 60,169 ఓట్లు మాత్రమే టీడీపీ ఆధిక్యం సాధించింది.

జిల్లా వ్యాప్తంగా 300 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగితే.. 202 స్థానాల్లో కూటమి.. 86 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

టీడీపీ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ సొంత మండలం కార్వేటినగరంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీగా జగదీష్‌రెడ్డి విజయ కేతనం ఎగురవేశారు. ఇదే నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ 4 జెడ్పీటీసీలు గెలిస్తే, టీడీపీ 2 స్థానాలకే పరితమైంది.

జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లు 1.30 లక్షలు దాటడం సంచలనమే.

అధికార బలానికి జంకలేదు.. రౌడీమూకల దాడులకు వెనుకంజవేయలేదు.. దౌర్జన్యాలకు భయపడలేదు.. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో

వైఎస్సార్‌సీపీ సైన్యం ముందడుగు వేసింది. కూటమి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆదర్శవంతంగా పోరాట పటిమను ప్రదర్శించింది.

సర్వశక్తులు కూడగట్టుకుని అరాచక వ్యవస్థతో తలపడింది. ఫలితాల కంటే మిన్నగా ప్రజాభిమానం చూరగొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement