అక్రమాలతో ప్రతిసారీ గెలవలేరు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలతో ప్రతిసారీ గెలవలేరు

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

చిత్తూరు కార్పొరేషన్‌: అక్రమాలు, దౌర్జన్యాలతో ప్రతిసారీ గెలవలేదరని, 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యమని పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న చిన్నగొట్టిగల్లు ఎంపీపీ అభ్యర్థి భర్త నాగలక్ష్మి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సహదేవరెడ్డితో పాటు 11 మంది సెక్యూరిటీ గార్డులను పరామర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి మోహిత్‌రెడ్డి జైలుకు వెళ్లి బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో కారును కాల్చేశారని ఆరోపిస్తూ, అధికార పార్టీ నేతల ఆదేశాలతో సహదేవరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. నామినేషన్‌ సమయంలోనే ఆయనను జైలుకు పంపారని మండిపడ్డారు. పొట్టకూట్టి కోసం సెక్యూరిటీగార్డులుగా వచ్చిన 11 మంది మాజీ సైనికులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆరోపించారు. మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలకు గానూ కూటమి దౌర్జన్యంతో 4 స్థానాలు గెలుచుకోగా, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆ అన్యాయాలను ఎదుర్కొని 3 స్థానాల్లో విజయం సాధించారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను హింసిస్తున్న వారందరూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement