చిత్తూరు కార్పొరేషన్: మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయ వేడి పల్లెలకు చేరింది. జిల్లాలోని 617 పంచాయతీల్లో ఈ నెల 26, 29, డిసెంబర్ 2న మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ జారీకి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. సర్పంచ్ అభ్యర్థుల కోసం 25, వార్డు సభ్యుల కోసం 20 చొప్పున గుర్తులు కేటాయించారు. వీటికి అదనంగా నోటా ఉండనుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే కొత్త గుర్తులు కేటాయించనున్నారు.
సర్పంచ్‌లకు ఇవే
టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష పండ్లు, తిరగలి, కుండ, మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, సాసర్, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.
వార్డు సభ్యులకు..
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇసీ్త్రపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్క్రీమ్, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు.


