ఇంటి ముంగిటకు న్యాయ సేవలు | - | Sakshi
Sakshi News home page

ఇంటి ముంగిటకు న్యాయ సేవలు

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక, ఆర్థిక అసమానతల కారణంగా సమాజంలో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్‌పర్సన్‌ అరుణ సారిక స్పష్టం చేశారు. నవంబర్‌ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ న్యాయ సేవా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం చిత్తూరులోని జిల్లా కోర్టు సమావేశమందిరంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. శ్రీనివాసరావు, డీఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ ఎం.ఎస్‌. భారతి, డీఎస్పీ వెంకటనారాయణ, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం, చిత్తూరు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సురేష్‌ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 39ఏ ప్రకారం సమానత్వంతో పాటు ఉచిత న్యాయ సహాయం పొందడం పౌరుల హక్కు అని తెలిపారు. న్యాయ సేవలు కేవలం కోర్టు ఆవరణకే పరిమితం కాకుండా గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటకు చేరాలని ఆకాంక్షించారు. లోక్‌ అదాలత్‌లు, మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్‌ కేసులను సత్వరమే రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. పారా లీగల్‌ వలంటీర్లు, ప్యానల్‌ న్యాయవాదులు ప్రజలకు, న్యాయవ్యవస్థకు మధ్య వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి చట్టాలపై అపోహలకు గురి కావద్దని కోరారు. డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్‌, న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రతి పౌరుడికీ న్యాయంపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement