పెద్దపంజాణి : మండలంలోని పలమనేరు–పుంగనూరు మార్గంలో ఒంటిల్లు బస్టాప్ వద్ద సోమవారం అర్ధరాత్రి టెంపో ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. బసవరాజు కండ్రిగ గ్రామానికి చెందిన గంగులప్ప కుమారుడు పెద్ద రెడ్డెప్ప(23) సొంత పనుల నిమిత్తం పలమనేరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా పాలవాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తల్లి భారతమ్మ ఫిర్యాదు మేరకు మంగళవారం పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బావిలో గుర్తుతెలియని మృతదేహం
బైరెడ్డిపల్లె : పుంగనూరు జాతీయ రహదారిలోని గంగినాయనపల్లె వద్ద సర్కారుతోపులో ఉనన పాడుపడిన బావిలో గుర్తుతెలియని మృతదేహాన్ని పశువుల కాపర్లు మంగళవారం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చందనప్రియ, తన సిబ్బందితో ఘటనా స్థలం చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి మరణించి సుమారు 4 రోజులై ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
చిరుత దాడిలో దూడ మృతి
ఐరాల: చిరుత పులి దాడిలో దూడ మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని ఎగువకామినాయనపల్లెలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బి.పురుషోత్తంనాయుడు హంద్రీ–నీవా కాలువ పక్కన తన మామిడి తోటలో సోమవారం రాత్రి నాలుగు పాడి ఆవులతో పాటు దూడను కట్టేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఉదయం మామిడి తోట వద్దకు వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉంది. దూడ గొంతు భాగంలో కొరికిన ఆనవాళ్లు ఉండటంతో చిరుత దాడి చేసినట్లు గుర్తించారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నం ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత దాడిగానే నిర్ధారించారు. చిరుత సంచారంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు కట్టపై గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. వివరాలు.. కట్టమంచి చెరువు కట్టపై ఓ వ్యక్తి మృతి (45 ఏళ్ల వ్యక్తి) చెందాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతుడి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి ఒంటిపై గీతలు కలిగిన తెల్లషర్టు, బ్లూకలర్ ప్యాంట్ ఉంది.
హత్య కేసులో నలుగురి అరెస్ట్
కార్వేటినగరం : మండలంలోని కేఎంపురంలో యుగంధర్ అనే వ్యక్తిని కారుతో గుద్ది హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. మంగళవారం రాత్రి ఈ మేరకు నిందితుల అరెస్ట్‌ను చూపించారు. తురకమిట్టకు చెందిన యుగంధర్ తమ సమీప బందువు కేఎం పురానికి చెందిన గిరికి ప్రదీప్‌రాజు, దిలీప్‌రాజు,లీలాకుమార్(లీలాకృష్ణ), రవికుమార్‌రాజు, విజయమ్మ కుటుంబానికి వివాదం నడుస్తోంది.ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యుగంధర్‌ను ప్రదీప్‌రాజు కుటుంబ సభ్యులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో యుగంధర్ మృతి చెందాడు. నిందితులు ప్రదీప్‌రాజు,దిలీప్‌రాజు, లీలాకుమార్, విజయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రవికుమార్‌రాజు పరారీలో ఉన్నాడు.


