చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరులోని పీసీఆర్ పాఠశాలలో జిల్లా కో–ఆర్డినేటర్ జయప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు డీఈవో కార్యాలయం వద్ద ఓపెన్ స్కూల్ విద్యా విధానంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. చదువు మధ్యలో ఆపేసిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓపెన్ స్కూల్ విద్యను చేరవేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు. అడ్మిషన్ల గడువును పొడిగించినందున, నమోదు శాతం పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కో–ఆర్డినేటర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ పరీక్షల్లో కాపీయింగ్‌కు అవకాశం కల్పించకూడదన్నారు. జిల్లా కో–ఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్టడీ సెంటర్లలో అడ్మిషన్ల టార్గెట్‌ను పూర్తిచేయాలని సూచించారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, వయోజన విద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ ఆజాద్, ఇంటర్మీడియట్ డీఐఈఓ రఘుపతి పాల్గొన్నారు.


