సమస్యల పరిష్కారానికి వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి వినతి

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లావ్యాప్తంగా త్వరలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యే టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో నేతలు కోరారు. మంగళవారం ఈ మేరకు డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌ కు వినతిపత్రం అందజేశారు. నేతలు మదన్‌మోహన్‌రెడ్డి, మణిగండన్‌, జీవీ రమణ మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వృద్ధ ఉపాధ్యాయులకు పంచాయతీ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తీవ్రమైన వైద్య,ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలకు విధులు కేటాయించకూడదని సూచించారు.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి గౌరవ వేతనం ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు కౌంటింగ్‌, పోలింగ్‌ కేంద్రాల వద్ద నాణ్యమైన భోజన వసతిని సక్రమంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో నాయకుల వినతులపై స్పందించిన డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ అంశాలన్నింటినీ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేతలు రెడ్డెప్పనాయుడు, మునీర్‌, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement