వైఎస్సార్‌సీపీలో యువతరంగాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో యువతరంగాలు

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

గంగాధర నెల్లూరు : వైఎస్సార్‌సీపీ జీడీనెల్లూరు మండలంలో ఇద్దరు యువ ఎంపీటీసీలు గెలుపొందారు. చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసి తొలి యత్నంలోనే విజయం సాధించారు.

21 ఏళ్లకే..

పాత వెంకటాపురం సెగ్మెంట్‌ బోజ్జి నాయనపల్లెకు చెందిన కల్యాణి ఇంటర్‌ చదివారు. ఎంపీటీసీ సెగ్మెంట్‌ బీసీ మహిళకు కేటాయించగా, రజక కులానికి చెందిన కల్యాణి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొని 21 ఏళ్లకే ఎంపీటీసీగా 364 ఓట్లతో విజయం సాధించారు.

24 ఏళ్లకే..

వెజ్జుపల్లె సెగ్మెంట్‌కు చెందిన నాగార్జున ట్రాక్టర్‌, జేసీబీ డ్రైవర్‌గా పనిచేసేవారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎస్సీ సామాజికవర్గానికి వెజ్జుపల్లె ఎంపీటీసీ స్థానం కేటాయించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పచ్చమూక గూండాగిరీకి అదరక.. బెదరక 24 ఏళ్లకే ఎంపీటీసీ సభ్యుడిగా 509 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement