కౌంటింగ్‌లో అక్రమాలపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌లో అక్రమాలపై ఫిర్యాదు

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

చిత్తూరు కార్పొరేషన్‌ : పూతలపట్టులోని ఎస్వీసెట్‌ కళాశాలలో చేపట్టిన ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో కూటమి నేతలతో కలిసి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఐరాల మండలం గుండ్లపల్లె సెగ్మెంట్‌ ఎంపీటీసీ అభ్యర్థి జనార్ధన్‌ ఆరోపించారు. సోమవారం ఈ మేరకు జెడ్పీ కార్యాలయంలో సీఈఓ రవికుమార్‌నాయుడుకు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగం మొత్తం కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలను మార్చారన్నారు. సెగ్మెంట్‌ పరిధిలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 6/18 బ్యాలెట్‌ బాక్సులోని ఓట్లు లెక్కింపు సమయంలో పెరిగిన ఓట్లపై కౌంటింగ్‌ అధికారులు సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలింగ్‌రోజున పీఓ ఇచ్చిన అధికారిక డిక్లరేషన్‌లో మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంపీటీసీకు 442గా నమోదు చేశారన్నారు. అయితే శనివారం కౌంటింగ్‌ రోజున బ్యాలెట్‌ బ్యాక్సులో ఓట్లను పరిశీలించగా 468 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అదనంగా వచ్చిన 26 ఓట్లపై ఏజెంటు చంద్రశేఖర్‌ ప్రశ్నిస్తే అధికారులను స్పందించలేదని మండిపడ్డారు. అదే సమయంలో కౌంటింగ్‌ ప్రక్రియ పరిశీలనకు వచ్చిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డిక్లరేషన్‌ ఫారమ్‌పై ఏజెంట్లు సంతకం పెట్టలేదన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఈ క్రమంలోనే కౌంటింగ్‌లో అవకతవకల పై సమగ్ర విచారణ జరపాలని సీఈఓను కోరారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement