శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం రాత్రి ఆకాశ దీపాన్ని ఆగమోక్తంగా వెలిగించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ ఆకాశ దీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఊంజల్ సేవ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపానికి పూజలు చేశారు. అనంతరం స్థూపానికి జ్యోతిని అమర్చి ఆకాశదీపంగా ఎగురవేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాన్ని దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బీకే వెంకటేశులు, బొజ్జల బృందమ్మ తదితరులు పాల్గొన్నారు.


