చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈ నెల 16 నుంచి 30 రోజుల పాటు పురుషులకు ఏసీ, రిఫ్రిజిరేటర్ల సర్వీసింగ్‌లపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ బాలకోటి సోమవారం తెలిపారు. తెల్లరేషన్ కార్డు గల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన పురుషులు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేస్తామని చెప్పారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఎడ్యుకేషన్ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 87908 60657, 96764 50037 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కారు వివాదంలో వ్యక్తి దారుణ హత్య
కార్వేటినగరం : కారు వివాదంలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కార్వేటినగరానికి కూత వేటు దూరంలో సోమవారం జరిగింది. సీఐ హనుమంతప్ప కథనం మేరకు వివరాలు.. కార్వేటినగరం కేఎంపురానికి చెందిన గిరి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన లీలాకుమార్ ద్వారా కిషోర్ నుంచి కారును అద్దెకు తీసుకున్నాడు. అలాగే కొల్లాగుంట గ్రామానికి చెందిన సుమన్‌కు కారు తీసి ఇస్తానని రూ,3 లక్షలు పుచ్చుకున్నాడు. కొంత కాలం వరకు కారు తీసి ఇవ్వకపోవడంతో సుమన్ నిలదీశాడు. దీంతో తన వద్ద ఉన్న కిషోర్ కారును ఇచ్చి కొంత కాలం వరకు వాడుకోమని చెప్పాడు. సుమన్ తీసుకున్న కారు కొన్నాళ్ల క్రితం చంద్రగిరి వద్ద జరిగిన ప్రమాదంలో దెబ్బతింది. ఈ క్రమంలో కారుకు మరమ్మతు చేయించడానికి తిరుపతికి తీసుకెళ్లాడు. అయితే కిషోర్ తన కారును తిరిగి ఇవ్వాలని లీలాకుమార్‌ను నిలదీశాడు. దీంతో లీలాకుమార్ కూడా కారు కోసం గిరిపై ఒత్తిడి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. దీంతో గిరికి దగ్గర బందువు అయిన యుగంధర్‌కు తన పరిస్థితిని వివరించాడు. ఈ క్రమంలో యుగంధర్ జోక్యం చేసుకుని గిరి, లీలాకుమార్‌కు సర్ధిచెప్పాడు., కానీ, వారి కుటుంభాలు గొడవ పడ్డాయి. గిరి కుటుంబం వారు లీలాకుమార్ కుటుంబంపై కార్వేటినగరం ఫోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరిగి వెళుతుండగా లీలాకుమార్ ప్రదీప్‌కుమార్, దిలీప్‌కుమార్, విజయమ్మ కలసి నకార్వేటినగరానికి వస్తూ ద్విచక్రవాహనంపై వెళుతున్న యుగంధర్‌ను ఢీకొన్నాడు. దీంతో యుగంధర్ అక్కడికక్కడే మరణించాడు. అదే ద్విచక్రవాహనంపై ఉన్న ప్రభుదాస్ అనే వ్యక్తి గాయపడ్డాడు. కార్వేటినగరం ఎస్.ఐ వెంకటేశ్వర్లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.


