తిరుపతి సిటీ: జిల్లాలోని పలు ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఓఏఎమ్‌డీసీ ద్వారా చేపట్టిన మూడవ విడత ప్రవేశాల ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లాలోని సుమారు 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేవలం 45 శాతం సీట్లు మాత్రమే భర్తీకాగా, ప్రైవేటు కళాశాలల్లో 75 శాతం ప్రవేశాలు జరిగినట్లు తెలుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూలో మాత్రమే 85శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలోనూ అన్ని గ్రూపులలో కలిపి సుమారు 300కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో జరగనున్న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలోనైనా పూర్తి స్థాయిలో డిగ్రీ అడ్మిషన్లు జరుగేనా అంటూ అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి.
వైఎస్సాసీపీ అభిమానిపై దాడి
రైల్వేకోడూరు అర్బన్: మండలంలోని మాధవరంపోడుకు చెందిన రామిరెడ్డి పవన్‌కళ్యాణ్‌రెడ్డి అనే వైఎస్సార్సీపీ అభిమాని తమ గ్రామ ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించినందుకు గ్రామంలో శనివారం రాత్రి బాణసంచా కాల్చాడు. అతని ఇంటి దగ్గరో ఉన్న టీడీపీ నాయకులు బొట్ల వెంకటరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి మరో నలుగురు కట్టెలతో అతనిపై దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లారు.
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,467 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,462 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


