ఏకపక్షంగా లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

ఏకపక్షంగా లెక్కింపు

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

– కుప్పంలో కౌంటింగ్‌ అధికారుల అక్రమాలు

కుప్పం : కుప్పం నియోజక వర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌటింగ్‌లో ఏకపక్షంగా సాగింది. శనివారం ఎంఎఫ్‌సీ వృత్తి విద్యా కళాశాలలో మొత్తం 4 జెడ్పీటీసీ స్థానాలు, 53 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రదానంగా వైఎస్సార్‌ సీపీ ఆధిక్యత ప్రదర్శించిన ఎంపీటీసీ సెగ్మెంట్లలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు ఎంపీటీసీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి సరస్వతి మొదట 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు, ఏజెంట్లతో పడిగాపులు కాయించి సాయంత్రం ఆరు గంటలకు 6 ఓట్లతో టీడీపీ అభ్యర్థి రూప విజయం సాధించినట్లు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో గుడుపల్లె మండలం, గుండ్లసాగరం సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపులో తేడా రావడంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి రేణుక ప్రశ్నించడంతో ఆమె భర్త కృష్ణమూర్తిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వైఎస్సార్‌ సీపీ ఓట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించడంపై కృష్ణమూర్తి నిలదీయడంతో ఆయనపై టీడీపీ శ్రేణులు, పోలీసులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. కౌంటింగ్‌ కేంద్రంలోని ఏజెంట్లు, రేణుకా భర్త కృష్ణమూర్తిని బలవంతంగా బయటికి తీసుకువచ్చి స్టేషన్‌కు తరలించారు.

గెలిచినప్పటికీ.. ఓడగొట్టారు

రాళ్లబూదుగూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌కు జరిగిన కౌంటింగ్‌లో గెలిచినప్పటికీ అధికారులు దుర్మార్గంగా ఓడగొట్టారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సరస్వతి మండిపడ్డారు. సాయంత్రం వరకు కూర్చోబెట్టి చివరకు 6 ఓట్లతో ఓడిపోయావని చెప్పారని ఆవేనద వ్యక్తం చేశారు. అభ్యర్థిని అయినప్పటికీ తనను కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించలేదని, తన భర్తలను మాత్రమే పంపించారని చెప్పారు. 17 ఓట్లతో నేను గెలుపొందితే, అధికారులు ఓడిపోయావని ప్రకటించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో మహిళా అభ్యర్థులకు స్వేచ్ఛ, రక్షణ లేకపోతే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించుకోవాలని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement