– ఎస్వీపీపీ విద్యాసంస్థ ఉద్యోగులకు
పది శాతం దీపావళి బోనస్
తిరుపతి ఎడ్యుకేషన్ : పుత్తూరులోని ఎస్వీపీపీ విద్యాసంస్థల యాజమాన్యం తమ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. పది శాతం మేర బోనస్ అందించనున్నట్టు యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐదేళ్లుగా యాజ మాన్యం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగానే ప్రతి ఏటా బోనస్ అందిస్తున్నట్టు వెల్లడించింది. యాజామాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల ఎస్వీపీపీ విద్యాసంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డా.ఎన్.గోపీకృష్ణ, సిబ్బంది హర్షం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా వారు వైస్ చైర్మన్ రావూరి బాలాజీ, డా.రావూరి వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ప్రత్యేక శిక్షణ
తిరుపతి అర్బన్: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్.విశ్వనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2027–2028 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జవవరి 31న జరుగుతుందన్నారు. దరఖాస్తులకు ఈ ఏడాది డిసెంబర్ 2 ఆఖరు అని చెప్పారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, పరీక్షా సరళి, సిలబస్, సన్నద్ధతకు అనుసరించాల్సిన ప్రణాళిక తదితర అంశాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. గత 37 ఏళ్లుగా విశ్వం విద్యాసంస్థలు విద్యారంగంలో అందిస్తున్న సేవలను వివరిస్తూ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, ప్రత్యేక శిక్షణ, నిరంతర మాక్ టెస్టులు, వ్యక్తిగత పర్యవేక్షణతో విద్యార్థులను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను లేదా 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తహసీల్దార్‌పై
పచ్చ సీఐ దౌర్జన్యం
సాక్షి, తిరుపతి: అధికార పార్టీ మెప్పు కోసం తహతహలాడుతున్న నాయుడుపేట సీఐ తురక వెంకటరమణ అత్యుత్సాహంతో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతల టార్గెట్‌గా దురుసుగా ప్రవర్తించిన సీఐ శనివారం ఏకంగా చిట్టమూరు తహసీల్దార్ రామయ్యపై అమానుషంగా ప్రవర్తించారు. తహసీల్దార్ ఎన్నికల విధులకు హాజరై నాయుడుపేటలోని కౌంటింగ్ కేంద్రం ఆవరణలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి సీఐ కుర్చీలో కుర్చుని ఉన్న తహసీల్దార్ వద్దకు వచ్చి ఇక్కడ నుంచి లేవాలని.. లేకుంటే చెంప చెళ్లుమనిపిస్తామని దుర్భాషలాడినట్లు తహసీల్దార్ వాపోయారు. తాను తహసీల్దార్‌నని, ఎన్నికల విధులకు హాజరయ్యానని చెప్పినప్పటికీ సీఐ అమానుషంగా వ్యవహరించినట్లు రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకటగిరిలో టై
వెంకటగిరి మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో నాలుగింటిని వైఎస్సార్‌సీపీ, మరో నాలుగు టీడీపీ దక్కించుకున్నాయి. దీంతో వెంకటగిరి ఎంపీపీ స్థానం టై అయ్యింది. ఎలాగైనా ఎంపీపీ స్థానం దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం చేస్తున్నారు.


